వికారాబాద్ ఘటన.. మాజి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్ (CLiC2NEWS): వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో కొడంగల్ మాజి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 16 మంది నిందితులను అరెస్టు చేయగా.. బుధవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేశ్ సోదరిడితో పాటు మరో ముగ్గురు ఉన్నారు. అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. లగచర్ల లో ఫోన్‌కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు సురేశ్‌తో నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు సమాచారం. మణికొండలో నివాసముంటున్న సురేశ్.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.