న్యాయ‌వాదిపై దాడి.. ఇద్ద‌రు మైన‌ర్లు అరెస్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): నగ‌రంలో మంగ‌ళ‌వారం న్యాయ‌వాదిపై దాడి చేసి ఇద్ద‌రు నిందితులు దాడి చేసి మెబైల్ ఫోన్‌ల‌ను చోరీ చేశారు. ఈ కేసును ఛేదించిన సెంట్ర‌ల్ జోన్ పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. అబిడ్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధి గ‌న్‌ఫౌండ్రిలోని ప్ర‌సాద్ అపార్ట్‌మెంట్ వ‌ద్ద మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున వాచ్‌మెన్‌ను క‌త్తితో బెదిరించి ఫోన్‌లు ఎత్తుకెళ్లారు. అనంత‌రం ఐమాక్స్ వ‌ద్ద 5 గంట‌ల స‌మ‌యంలో వాకింగ్ చేస్తున్న న్యాయ‌వాది క‌ల్యాణ్ ను క‌త్తితో బెదిరించి ఫోన్ ఎత్తుకెళ్లేందుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలో క‌ల్యాణ్‌కు గాయాల‌య్యాయి. పోలీసులు రెండు ప్ర‌త్యేక బృందాల‌తో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సిసిటివి పుటేజ్ ఆధారంగా నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుండి ఫోన్‌ల‌ను, క‌త్తి , హోండా యాక్టివా వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ‌తంలో వారిపై ఇదే త‌ర‌హాలో ముషీరాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మొబైల్ స్నాచింగ్ కేసు న‌మోదైన‌ట్లు తెలిపారు. వారి ఆధార్‌కార్డుల ఆధారంగా వారు మైన‌ర్లుగా తేలింద‌న్నారు. వ‌య‌సును నిర్ధారించేందుకు ఉస్మానియా ఆస్ప‌త్రికి పంపించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.