నిజామాబాద్ లో అరుదైన ప్రసవం
నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ పాజిటివ్ గర్భిణీ ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు ఆడ, ఒక మగ బిడ్డ ఉన్నారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు డాక్టర్లు వైద్యం అందించారు. ప్రసవం తర్వాత మహిళకు కొవిడ్ నెగెటివ్ వచ్చినట్లుగా వైద్యులు తెలిపారు. ముగ్గురు శిశువులకు కూడా పరీక్షల్లో కొవిడ్ నెగెటివ్ వచ్చినట్లు గుర్తించారు.