ఎపి సిఎం చంద్ర‌బాబును క‌లిసిన పిటి ఉష‌..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో ఒలింపిక్ సంఘం అధ్య‌క్షురాలు, రాజ్య‌స‌భ సభ్యురాలు పిటి ఉష భేటీ అయ్యారు. ఉండ‌ల్లిలోని సిఎం నివాసంలో స‌మావేశ‌మయ్యారు. అమ‌రావ‌తిలో నేష‌న‌ల్ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు, స్పోర్ట్స్ సిటిని అభివృద్ది చేసే ప్ర‌ణాళిక‌ల‌పై స‌మావేశంలో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. 2029లో జాతీయ క్రీడ‌ల‌కు ఆతిథ్యం ఇచ్చేంద‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని సిఎం కోరారు. నూత‌న క్రీడా విధానం , అథ్లెట్ల‌కు శిక్ష‌ణ‌పై చ‌ర్చించిన‌ట్లు సిఎం ట్వీట్ చేశారు. రాష్ట్రానికి స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రాన్ని తీసుకొచ్చే విష‌యంలో ఆమె మ‌ద్ద‌తు కోరారు. ప్ర‌తిభావంతులైప‌న యువ క్రీడాకారుల‌కు అత్యుత్త‌మ అవకాశాలు క‌ల్పించేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందిని సిఎం స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.