ఒకే రూట్‌లో వెళ్లేవారి కోసం ప్ర‌త్యేక బ‌స్సులు.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌జ‌ల‌కు ర‌వాణా స‌దుపాయాల‌ను మ‌రింత చేరువ‌చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. న‌గ‌రంలో పెరుతున్న కాల‌నీలు దృష్ట్యా అంద‌రికీ అందుబాటులో బ‌స్సు స‌దుపాయం క‌లుగ‌జేసే విధంగా బ‌స్సులు న‌డిపిస్తున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. ఒకే రూట్‌లో వెళ్లే వారుంటే అధికారుల దృష్టికి తేవాల‌ని.. వారి కోసం ప్ర‌త్యేక బ‌స్సులు వేస్తామ‌ని హామీ ఇచ్చిరు. ఆయ‌న ఆర్‌టిసి అములు చేస్తున్న డిజిట‌ల్ పేమెంట్స్ ను ప‌రిశీలించారు. ముషీరాబాద్ లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందుతున్న 14 మంది ఆర్‌టిసి ఉద్యోగుల‌కు మంత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఆర్‌టిసిలో అనేక సంస్క‌ర‌ణ‌లు, ఆర్‌టిసి ఉత్యోగుల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తూ పాత బ‌కాయిలు చెల్లిస్తూ నూత‌న నియామ‌కాలు చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అంతే కాకుండా కొత్త బ‌స్సులు కొనుగోలు చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.