ఉత్తమ విలువలు కలిగిన మహనీయుడు మాజి సిఎం రోశయ్య..
రామగుండం (CLiC2NEWS): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య.. 50 ఏళ్లు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా వివాద రహితుడిగా పేరు పొందారని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. కొణిజేటి రోశయ్య 92వ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమీషనరేటులో ఘనంగా నిర్వహించారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా కొణిజేటి రోశయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తిత్వం.. ఎన్నో పదవులు.. ఉత్తమ విలువలతో.. ఆ పదవులకే వన్నెతెచ్చిన రాజకీయ దురంధరుడు రోశయ్య అన్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అందరివాడు, ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దక్కించుకున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత తమిళనాడు గవర్నర్గా రోశయ్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ .భీమేశ్ ,సిసి ఆర్ బి ఇన్స్పెక్టర్ సతీష్ , ఎ ఓ శ్రీనివాస్ సూపరిన్ డింట్ లు సందీప్, ఇంద్రసేనా రెడ్డి, సంధ్య , ఆర్ఐ లు దామోదర్, వామన మూర్తి, మల్లేశం, సిసి హరీష్, సీపీఓ సిబ్బంది, వివిధ వింగ్స్ సిబ్బంది, అర్ముడ్, స్పెషల్ పార్టీ, తదితరులు పాల్గొన్నారు.