కోరుట్ల లో దారుణం..

జ‌గిత్యాల (CLiC2NEWS):  బాలిక గొంతుకోసి దారుణంగా హ‌త్య‌చేసిన ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది. ప‌ట్ట‌ణానికి చెందిన ఐదేళ్ల బాలిక శ‌నివారం అతికిరాత‌కంగా హ‌త్య‌చేయ‌బ‌డింది. బాలిక క‌నిపించ‌కుండా పోవ‌డంతో త‌ల్లిదండ్రులు వెత‌క‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో స‌మీపంలో ఉన్న ఓ ఇంట్లో బాలిక శ‌వ‌మై క‌నిపించింది. ఆ ఇంట్లోని బాత్రూంలో గొంతుకోసి హ‌త్య చేశారు. విగ‌త‌జీవిగా క‌నిపించిన త‌మ కుమార్తెను చూసిన త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. బాలిక మృత‌దేహం క‌నిపించిన ఇంటి య‌జ‌మాని ప‌రారీలో ఉన్న‌ట్లు స‌మ‌చారం. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్న‌ట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.