తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేయాలి.. ఎమ్మెల్సీ క‌విత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్నపై శాస‌న మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి ఎమ్మెల్సీ క‌విత ఫిర్యాదు చేశారు. త‌న‌పై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని.. విచ‌క్ష‌ణాధికారాలు ఉప‌యోగించి ఆయ‌న్ను ఎమ్మెల్సీ ప‌ద‌వి నుండి స‌స్పెండ్ చేయాల‌ని ఆమె కోరారు.
తీన్మార్ మ‌ల్ల‌న్న చేసిన వ్యాఖ్య‌ల‌పై డిజిపికి క‌విత ఫిర్యాదు చేశారు.

క‌విత మీడియాతో మాట్లాడుతూ.. బోనం ఎత్తుకున్న ఆడ‌బిడ్డ‌ను అమ్మ‌వారిలా చూసే సంస్కృతి మ‌నద‌ని.. తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక గౌర‌వం ఉంద‌న్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోని మ‌హిళ‌లు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌ని.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతున్నారు. బాధ్యతాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తుఉల ప‌రుష ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు చేస్తే వ‌చ్చే వాళ్లు కూడా వెన‌క్కి త‌గ్గే ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు. ఆడ‌బిడ్డ‌లు రాజ‌కీయాల్లోకి రావ‌ద్దా.. ఏదైనా ఉంటే అంశం ప్రాతిప‌దిక‌న మాట్లాడాలి కానీ.. ఏం మాట‌లివని ప్ర‌శ్నించారు.

దాదాపు ఏడాదిన్న‌ర‌గా బిసి స‌మ‌స్య‌ల‌పై తెలంగాణ జాగృతి త‌ర‌పున పోరాటం చేస్తున్నాం. ఏరోజూ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఒక్క మాట కూడా అన‌లేద‌న్నారు. త‌న‌ని ఎందుకు అలా అన్నారో తెలియ‌ద‌ని క‌విత తెలిపారు. జాగృతి ఎన్నో కార్య‌క్ర‌మాలు చేసింద‌ని.. అందులో బిస ఉద్య‌మం ఒక‌ట‌న్నారు. ఇంకా ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తామ‌న్నారు. నాలాంటి వాళ్ల‌ను కోట్లాది మందిని త‌యారు చేస్తానన్నారు. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను సిఎం అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. మ‌ల్ల‌న్న వ్యాఖ్య‌ల‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌ను క‌లుస్తామ‌ని క‌విత తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.