జైపూర్: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

జైపూర్ (CLiC2NEWS): ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జ్ పర్వతపు రవి అన్నారు. మంచిర్యాల జిల్లా, జైపూర్ మండల కేంద్రంలోని KGVB బాలికల 10వ త‌ర‌గ‌తి మరియు ఇంటర్‌ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళల చట్టాలు గురించి.. పుట్టుక నుండి మరణం వరకు చ‌ట్టాలు వర్తిస్తాయ‌ని న్యాయమూర్తి వివ‌రించారు. . మహిళల పైన గౌరవభావం అంద‌రు కలిగి ఉండాల‌న్నారు.

ఈ కార్యక్రమంలో ఫోక్సో ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ రాంబాబు, చెన్నూరు కోర్టు న్యాయవాదులు మహేష్, పూనం, బండారి శ్రీనివాస్ ,రాజేష్ ,వినోద్ ASI హబీబ్, కోర్టు సిబ్బంది, శృతి మ‌రియు పాఠ‌శాల విద్యార్థులు, హెచ్ ఎమ్‌ ఫణిబాలా , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.