నంద్యాల జిల్లాలో పెద్దపులి దాడి.. యువకుడికి గాయాలు..
ఆత్మకూరు (CLiC2NEWS): పొలం పనులు చేసుకుంటుండగా ఓ యువకుడిపై పెద్దపులి దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఓ యువకుడిపై పెద్దపులి దాడి చేసింది. కొత్త పల్లి మండలం సదరం పెంట చెంచుడూడెంకు చెందిన పులిచెర్ల అంకన్నకు పెద్దపులి దాడిలో గాయాలయ్యాయి. నల్లమల అటవీ సమీపంలోని వరి పొలంకి వెళ్లగా.. పొదల్లో ఉన్న పెద్దపులి దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన యువకుడు తప్పించుకని ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.