వ‌రంగ‌ల్: త‌హ‌సీల్దార్ నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తింపు

వ‌రంగ‌ల్ (CLiC2NEWS):  హ‌నుమ‌కొండ‌లో ఓ త‌హ‌సీల్దార్  ఆదాయానికి మించిన ఆస్తులు క‌లిగి ఉన్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఖిలా వ‌రంగ‌ల్ త‌హ‌సీల్దార్ బండి నాగేశ్వ‌ర‌రావు నివాసంలో దాదాపు రూ.5 కోట్ల విలువైన ఆస్తులు అధికారులు గుర్తించిన‌ట్లు స‌మాచారం. బండి నాగేశ్వ‌ర‌రావు హ‌నుమ‌కొండ జిల్లాలోని హ‌స‌న్‌ప‌ర్తి, ధ‌ర్మ‌సాగ‌ర్‌, కాజిపేట మండ‌లాల్లో కూడా త‌హ‌సీల్దార్గా ప‌నిచేశారు.

హునుమ‌కొండ చైత‌న్య‌పురిలోని  ఆయ‌న‌ ఇంట్లో శుక్ర‌వారం అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఆయ‌న నివాసంతో పాటు బందువుల ఇళ్ల‌లోనూ ఏక‌కాలంలో సోదాలు నిర్వ‌హించారు. ఎసిబి డిఎస్‌పి సాంబ‌య్య ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక బృందాలు ఈ త‌నిఖీలు చేప‌ట్టాయి.

 

త‌హ‌సీల్దార్ నివాసంలో ఎసిబి అధికారులు గుర్తించినవి

రూ.1.42 కోట్ల విలువైన 17.10 ఎక‌రాల‌ వ్య‌వ‌సాయ భూమి

రూ. 1.15 కోట్ల విలువైన ఇంటి ప‌త్రాలు

రూ. 34.78 లక్ష‌ల విలువైన 6 వాహ‌నాలు

రూ. 23.84 ల‌క్ష‌ల విలువైన 70 తులాల బంగారం

రూ. 16.43 ల‌క్ష‌ల విలువైన గృహోప‌క‌ర‌ణాలు

రూ.3.28 ల‌క్ష‌ల విలువైన  చేతి గ‌డియారాలు

రూ. 92 వేలు విలువైన వెండి వ‌స్తువులు

 

Also Read: చంద్రుడిపై ప‌రిశోధ‌న‌ల కోసం జ‌పాన్‌తో జ‌ట్టు

1 Comment
  1. amphetamine says

    Great post.

Leave A Reply

Your email address will not be published.