Ramagundam: పోలీస్ కమిషనరేట్ లో అన్నదాన కార్యక్రమం

చిన్నపిల్లలకు స్వయంగా వడ్డించిన క‌మిష‌న‌ర్‌

రామగుండం(CLiC2NEWS): రామగుండం  పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో శ‌నివారం అన్న‌దాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. వినాయక చ‌వితి సంద‌ర్భంగా గ‌ణేశుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా , మంచిర్యాల డిసిపి ఎ.భాస్కర్, పెద్దపల్లి డిసిపి కరుణాకర్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ స్వయంగా పిల్లలకి భోజనం వడ్డించారు.  మంథని డివిజన్ హ్యాండ్ క్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ (MDHWS), బాలల సంరక్షణ ఆశ్రమం, గోదావరిఖని లోని పిల్లలకి భోజనం వడ్డించారు. వారితో కలిసి అధికారులు భోజనం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్ బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ , జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, ఏఓ శ్రీనివాస్, వివిధ విభాగల ఇన్స్పెక్టర్ లు, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, శేఖర్,మల్లేశం, ఆర్ఎస్ఐ లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, సీపీఓ, వివిధ పాల్గొన్నారు.

 

Also Read: Chennai: గుండెపోటుతో కార్డియాక్ స‌ర్జ‌న్ మృతి

Leave A Reply

Your email address will not be published.