హైదరాబాద్‌లో 137 లింక్ రోడ్లు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్ రోడ్లను ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ రెండు లింక్ రోడ్లను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. మొదటిదశలో 35 లింక్ రోడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి రూ. 313కోట్ల 65 లక్షలు మంజూరు చేసి నట్టు చెప్పారు. మరో 100 లింక్ రోడ్లను అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 నుంచి పాత ముంబై రోడ్డు లెదర్ పార్క్ వరకు నిర్మించిన లింక్ రోడ్డును ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి కిందట ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రుల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ , దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆకర్షణీయ నగరంగా రూపుదిద్దుకుంటుంది. పట్టణీకరణ కూడా వేగంగా పెరుగుతుంది. దీంతో మౌలిక వసతులు పెంచాల్సిన అవసరం ఉంది. గడిచిన 6 సంవత్సరాలు మౌలిక వసతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు చేపట్టాం అని కేటీఆర్ వెల్లడించారు. వేగంగా పెరుగుతున్న
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ క్రమంలో మిస్సింగ్ రోడ్స్, లింక్ రోడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.