Kamareddy: స్వప్నలోక్ కాల‌నీలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి పట్టణం స్వప్నలోక్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఆదివారం 14 పీఠలతో సామూహిక స‌త్యేదేవుని వ్రత పూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు.

ఇక్క‌డ జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మాలు అర్చకులు శ్రీహర్ష ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్తీక మాసం కావ‌డంతో ఇక్క‌డ గణపతి పూజ, శ్రీ సత్యనారాయణ స్వామి పంచామృతాభిషేకాలు, శ్రీ అభయాంజనేయ స్వామి పూజలు నిర్వ‌హించారు. అనంత‌రం వన భోజన కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఈకార్య‌క్ర‌మంలో కాలనీవాసులు, బండారి పరివార్, కాసర్ల విహార్ కాలనీవాసులు భారీ సంఖ్య‌లో హాజయ్యారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

Also Read: కౌలాలంపూర్‌లో డాన్స్ ఇర‌గ‌దీసిన ట్రంప్‌

Leave A Reply

Your email address will not be published.