డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమానాలు ర‌ద్దు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా క‌ట్ట‌డికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఈ మేర‌కు డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు అన్ని అంత‌ర్జాతీయ విమ‌నాల‌ను ర‌ద్దు చేసింది. కొన్ని ప్ర‌త్యేక రూట్ల‌లో మాత్ర‌మే ప‌రిస్థితుల‌కు అనుగుణంగా విమానాల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) గురువారం వెల్ల‌డించింది. కొవిడ్‌-19కు సంబంధించిన ప్ర‌యాణ‌, వీసా ప‌రిమితులు పేరుతో తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. జూన్ 26న విడుద‌ల చేసిన స‌ర్క్యుల‌ర్‌కు మార్పులు చేస్తున్నామ‌ని, అన్ని అంత‌ర్జాతీయ వాణిజ్య ప్ర‌యాణికుల విమానాల‌ను డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ర‌ద్దు చేస్తున్న‌ట్లు అందులో పేర్కొన్న‌ది.

Leave A Reply

Your email address will not be published.