రేపు ఏలూరుకు సీఎం జ‌గ‌న్‌

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి రేపు (సోమ‌వారం) ఉదయం 9:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరుకు వెళ్లనున్నారు. ఉదయం 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు. ఈ ఘటనపై జగన్‌ ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సొంత నియోజకవర్గమైన ఏలూరులో జనాలు అస్వస్థతకు గురై పడిపోతున్న ఘటనపై ఆళ్ల నాని స్పందించారు. 227 మంది అస్వస్థతకు గురయ్యారని, మూర్ఛ, వాంతులతో బాధపడుతున్న బాధితులు పెరుగుతున్నారని.. బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు ఉన్నారని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.