దేశంలో కొత్తగా 23,950 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 23,950 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,99,066కు పెరిగింది. మహమ్మారి నుంచి తాజాగా 26,895 మంది కోలుకుకోగా.. ఇప్పటి వరకు 96,63,382 డిశ్చార్జి అయ్యారు. మరో 333 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,46,444కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,89,240 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ వివరించింది.