ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ డీన్‌గా భారత సంతతి ప్రొఫెసర్..
లండన్ (CLiC2NEWS): ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ డీన్‌గా భారత సంతతికి చెందిన అకాడెమిక్ ప్రొఫెసర్ సౌమిత్ర దత్తా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీకి చెందిన బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఈ మేరకు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ గురువారం వెల్లడించింది.