ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు!

ఇస్లామాబాద్ (CLiC2NEWS): పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి. పాక్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని నిర్వహిస్తున్న లాంగ్‌మార్చ్ ను వజీరాబాద్‌లో అల్లాహోచౌక్ వద్దకు రాగానే ఇమ్రాన్‌ఖాన్ కంటెయినర్‌పై దుండగులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పులపై పిటిఐ నేత ఫవాద్ చౌదురి మాట్లాడుతూ.. ఇమ్రాన్ లాంగ్‌మార్చ్‌లో కంటెయినర్‌పైకి ఎక్కి నిలబడిన సమయంలో జరిపిన కాల్పుల్లో ఆయన కాలికి గాయాలైనట్టు వెల్లడించారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న మరికొందరు నేతలు కూడా గాయాలు అయినట్లు డాన్ పత్రిక పేర్కొంది. కాల్పులకు పాల్పడిన దుండగులను అరెస్టు చేసినట్లు సమాచారం.
ఇమ్రాన్ ఖాన్ కంటెయినర్ వద్ద కాల్పుల ఘటనపై పాక్ ప్రదాని షెహబాజ్ షరీష్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.