ఎపిలో కొత్తగా 51 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో కొత్తగా 51 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఎపి వైద్య ఆరోగ్యశాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. అలాగే తాజాగా కరోనాకు చికిత్స పొంది 57 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంట్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కాగా తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 8,89,010 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వారిలో 8,81,238 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 607 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా ప్రభావంతో 7,165 మంది మృత్యువాత పడ్డారని అధికారులు వెల్లడించారు.