ఏపీలో కొత్తగా 1395 కొవిడ్ ‌ కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా 1,395 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 66,778 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 1,395 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌-19తో ఒక్కరోజులో 9 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా కొవిడ్‌ మరణాలు ఈ విధంగా ఉన్నాయి. చిత్తూరు, కృష్ణ, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, అనంతపూరం, తూర్పుగోదావరి, కడపలో ఒక్కో వ్యక్తి చొప్పున మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 2,293 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.
నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,56,159కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,32,284కు పెరిగింది. ఇక, 6,890 మంది ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్

toto togel

Leave A Reply

Your email address will not be published.