కళ్యాణలక్ష్మీ, షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి: నియోజికవర్గంలోని పలు మండలాలకు చెందిన 202 మందికి లబ్దిదారులకు 2 కోట్ల 2 లక్షల 23 వేయి 432 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,747 మందికి 37 కోట్ల 12 లక్షల 02 వేల 332 రూపాయల కల్యాణలక్ష్మి, షాది మూభారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కవద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఆడబిడ్డను మగబిడ్డతో సమానంగా పెంచాలని విప్ ఈ సందర్భాంగా అన్నారు.