`కోటి వృక్షార్చన`లో రుద్రాక్ష‌ మొక్క నాటిన కెసిఆర్

హైద‌రాబాద్: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌“లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొన‌సాగుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు సిఎం కెసిఆర్ రుద్రాక్ష‌ మొక్కను నాటి `కోటి వృక్షార్చన‌`లో పాల్గొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన ఇంత మంచి కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం పట్ల సిఎం సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను ముఖ్య‌మంత్రి కెసిఆర్ అభినందించారు.

 

Leave A Reply

Your email address will not be published.