ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపత్యంలో అక్కడి సర్కర్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా వారతంపు కర్ఫ్యూను విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సిఎం కేజ్రీవాల్ గురువారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని ఆసుపత్రుల్లో బెడ్ల కొరత లేదని, ప్రస్తుతం ఐదువేల పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో కొవిడ్ పరిస్థితిపై గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశమయ్యారు.
అతవ్యసరమైన సేవలను అందించే వారికి కర్ఫ్యూ పాసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. మాల్స్, జిమ్‌లు, స్పాలు, ఆడోటోరియంలు పూర్తిగా మూసివేయనున్నట్లు చెప్పారు. సినిమా హాళ్లు 30 శాతం సామర్థ్యంతో మాత్రమే పని చేస్తాయని, రెస్టారెంట్లలో కేవలం హోం డెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా మహమ్మారి వజృంభిస్తోంది. బుధవారం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 17వేలకుపై పాజిటివ్ కేసులు నమోదవగా.. 104 మంది మరణించారు. ప్రస్తుతం అక్కడ 50,736 క్రియాశీల కేసులున్నాయి.