మాజీ మంత్రి చందూలాల్‌ కన్నుమూత

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: మాజీమంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు అజ్మీరా చందూలాల్‌ (67) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం అర్థరాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చందూలాల్‌ మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గిరిజన ప్రజల సమస్యలకోసం ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. చందూలాల్‌ మృతిపట్ల రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.