ఎపిలో 5 వేలు దాటినా కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 5,086 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,42,135 కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,745 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఎపిలో 9,03,072 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 14 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఎపిలో ఇప్పటి వరకు కరోనాతో 7,353 మంది మృతి చెందారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 35,741 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 617, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. కడప మినహా మిగా అన్ని జిల్లాల్లో 200కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
