ఎమ్మెల్సీగా క‌విత ప్ర‌మాణ‌స్వీకారం

హైద‌రాబాద్ : నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత గురు‌వారం మ‌ధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి క‌విత‌ చేత ప్రమాణం చేయించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత‌కు మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో పాటు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ నెల 9న జరి‌గిన నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప‌ఎ‌న్ని‌కల్లో 88 శాతం ఓట్లతో కవిత ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.