ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా

హైదరాబాద్‌ : టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆమె స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకొని హోమ్ ఐసోలేషన్లో ఉండాలని ఆమె సూచించారు. ఇటీవల జరిగిన హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.