బిసిలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జివో విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని ఇటీవల మంత్రి మండలి నిర్ణయించింది. తాజాగా దీనిపై బిసి సంక్షేమ శాఖ జిఓను విడుదల చేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు బిసిలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జిఓ నంబర్ 9ని విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రంలో సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు జరగాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గడువు నిర్దేశించింది. దీనికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం బిసి రిజర్వేషన్లపై జిఓ జారీ చేసింది.
Also Read: తెలంగాణ నూతన డిజిపిగా శివధర్ రెడ్డి