భవిష్య‌త్తులో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిల స‌మ‌స్య ఉండ‌దు: సిఎం రేవంత్ రెడ్డి

ఢిల్లి (CLiC2NEWS) : భ‌విష్య‌త్తులో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ (fee-reimbursement) బ‌కాయిల స‌మ‌స్య ఉండ‌ద‌ని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుండి ప్ర‌తి ఏడాది ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ చెల్లిస్తామ‌ని తెలిపారు. బిఆర్ ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో బ‌కాయిలు పెట్టిన రీయింబ‌ర్స్‌మెంట్ రూ.8వేల కోట్లు భారంగా మారింద‌ని సిఎం అన్నారు.

కేంద్ర మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌తో సిఎం రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పిఎంఎవై 2.0 ప‌థ‌కం కింద తెలంగాణ‌కు 11.56 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయించాల‌ని సిఎం కోరారు. అంతేకాక‌.. విబిజిరామ్‌జి ప‌థ‌కంలో అద‌న‌పు ప‌నులు చేర్చాల‌ని ఆయ‌న కేంద్ర‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. కూర‌గాయ‌ల పందిళ్లు, ప‌శుగ్రాస ప్లాట్లు , ప‌ట్టు పురుగుల పెంప‌క షెడ్ల‌కు, మ‌ల్బ‌రి తోట‌లకు అనుమ‌తి కోరిన‌ట్లు స‌మాచారం. రైతుల జీవ‌నోపాధి మెరుగుప‌డేందుకు 10 కొత్త ప‌నుల‌ను విబిజిరామ్‌జి ప‌థ‌కంలో చేర్చాల‌ని.. ల‌బ్ధిదారుల‌కు 90 రోజులు ప‌ని క‌ల్పించాల‌ని సిఎం కోరారు.

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌పై హైకోర్టు ఆగ్ర‌హం..

Leave A Reply

Your email address will not be published.