మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం

మంచిర్యాల: సెప్టెంబ‌రు మొద‌టివారంలో మంచిర్యాల జిల్లాలోని భీమారం మండలం కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అట‌వీ అధికారులు దృవీక‌రించిన విష‌యం తెలిసిందే.. భీమారం మండలంలోని కాజిపల్లి అడవుల్లో మేత కోసం వెళ్లిన పశువుల మందపై దాడి చేసిన సమయంలో రెండు పెద్ద పులులు ఉన్నాయని పశువుల కాపరులు పేర్కొనడంతో అటవీశాఖ అధికారుల అనుమానాలు నిజమయ్యాయి.

త‌ప్ప‌క చ‌ద‌వండి: కే4 పులికి ఒంట్లో బాగోలేదా..?

అయితే తాజాగా జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన గ్రామస్తులు పులి సంచారాన్ని గుర్తించారు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని… అక్కడ ఉన్న అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.