మహారాష్ట్రలో కొత్తగా 6,112 కరోనా కేసులు

ముంబ‌యి: మ‌హారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న అమరావతి జిల్లాలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. గ‌త 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6,112 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,87,632కి చేరింది. అలాగే గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 44 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మ‌హారాష్ట్రలో కొవిడ్ మర­ణాల సంఖ్య 51,713కు చేరింది. మరో­వైపు కొత్త‌గా 2,159 మంది కరోనా రోగులు కోలు­కుని ఆసు­ప­త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలు­కున్న వారి మొత్తం సంఖ్య 19,89,963కు చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 51,713 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరో­గ్య­శాఖ తెలి­పింది.

Leave A Reply

Your email address will not be published.