సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం

పెద్దపల్లి : సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్‌పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రం 66 లెవెల్‌లో 41 డీప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది. అయితే స్థానిక అధికారుల ద్వారా ప్రమాదం నుంచి ముగ్గురు కార్మికులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.