21న ఒయు హాస్టల్స్ ఓపెన్!
హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ కారణంగా గతేడాది మార్చిలో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లను మూసేసిన విషయం విదితమే. అయితే ఈ హాస్టల్స్ ఈ నెల 21 తెరుచుకోబోతున్నట్లు సమాచారం. పదకొండు నెలల విరామం తర్వాత వసతి గృహాల ఓపెన్‌కు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా హాస్టల్ విద్యార్థులందరూ తప్పనిసరిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, నెగిటివ్ రిపోర్టు చూపిస్తేనే హాస్టళ్లకు అనుమతించనున్నారు. ఇక తల్లిదండ్రుల సమ్మతి పత్రం కూడా తప్పనిసరి చేశారు. అయితే ఫిబ్రవరి 16వ తేదీ నుంచే హాస్టల్స్ తెరవాలని నిర్ణయించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.