ఒకేసారి రూ.67 వేలు తగ్గిన వెండి ధర!
ఢిల్లీ (CLiC2NEWS): బంగారం , వెండి ధరలకు రెక్కలొచ్చిన సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని నెలల్లో ఎప్పుడూ లేని స్థాయిలో బంగారం , వెండి ధరలు నమోదయ్యాయి. అయితే, వీటి ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. ప్యూచర్ మార్కెట్ లో వెండి ధర దాదాపు రూ.67 వేలు తగ్గింది. దీంతో గురువారం రూ.4,20,048 ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన వెండి ధర.. దాదాపు రూ.90 వేలు తగ్గి రూ.3,32,002కు చేరింది. దీంతో పాటు బంగారం కూడా రూ.15 వేలు తగ్గి.. 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,157కు చేరింది.

హైదరాబాద్ విపణిలో గురువారం రాత్రి కిలో వెండి ధర రూ. 3,99,600 ఉండగా శుక్రవారం ఉదయానికి రూ. 3,70,000కి దిగొచ్చింది. అంటే.. దాదాపు రూ.30 వేలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ లోహాల ధరలు తగ్గుముఖం పట్టినట్లు సమాచారం.