లార్డ్స్‌లో శ‌త‌కం.. తొలి మ‌హిళా క్రికెట‌ర్ య‌స్తికా భాటియా..

లండ‌న్ (CLiC2NEWS): లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌, భార‌త్ మ‌ధ్య టెస్టు మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. భార‌త బ్యాట‌ర్ య‌స్తికా భాటియా (Yastika Bhatia) సెంచ‌రీ చేసి రికార్డు సృష్టించారు. దీంతో లార్డ్స్‌లో సెంచ‌రీ చేసిన తొలి మ‌హిళా క్రికెట‌ర్‌గా ఘ‌న‌త సాధించింది. అమెకు టెస్టుల్లో ఇది తొలి సెంచ‌రీ. మొత్తం 145 బంతుల్లో ఆమె సెంచ‌రీ సాధించింది.

భార‌త్ , ఇంగ్లాండ్ మ‌ధ్య శుక్ర‌వారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభ‌మైంది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 285 ప‌రుగులు చేయ‌గా.. ఇంగ్లాండ్ 170 ప‌రుగుల‌కే ఆలౌల‌యింది. దీంతో మొద‌టి ఇన్నింగ్స్ లో భార‌త్ 115 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. అనంత‌రం భార‌త్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 69 ఓవ‌ర్ల‌కు ఐదు వికెట్ల న‌ష్టానికి 264 చేసింది. ప్ర‌స్తుతం భార‌త్.. ఇంగ్లాండ్ పై 379 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

Also Read: Sports: తొలిసారి ‘లార్డ్స్’ వేదిక‌గా మ‌హిళల టెస్ట్ మ్యాచ్‌..

Leave A Reply

Your email address will not be published.