మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

ముంబ‌యి (CLiC2NEWS): ఈ మ‌ధ్య‌కాలంలో దిగివ‌చ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. ధ‌ర‌లు త‌గ్గ‌డంతో మ‌దుప‌ర్లు దీర్ఘ‌కాలిక వ్యూహంతో కొనుగోళ్ల‌కు దిగ‌డంతో బంగారం వెండి ధ‌ర‌లు మంగ‌ళ‌వారం మ‌ళ్లీ పెరిగాయి. దీంతో అంత‌ర్జాతీయ మార్కెట్లో ఔన్సు 4,887 డాల‌ర్ల వ‌ద్ద కొన‌సాగుతుంది. అలాగే వెండి 85.98 డాల‌ర్లు ప‌లుకుతోంది.

హైద‌రాబాద్ మార్కెట్లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధ‌రం 1.56 ల‌క్ష‌ల వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, కిలో వెండి ధ‌ర రూ. 2.74 ల‌క్ష‌లు ప‌లుకుతోంది.

నిన్న‌టి (సోమ‌వారం) ధ‌ర‌ల‌తో పోలిస్తే బంగారం ధ‌ర దాదాపు రూ. 6000 పేరిగింది. వెండి రూ. 20 వేల కు పైగా పెరిగింది.

Also Read: ఒకేసారి రూ.67 వేలు త‌గ్గిన వెండి ధ‌ర‌!

 

2 Comments
  1. […] Also Read: మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు […]

  2. […] మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు […]

Leave A Reply

Your email address will not be published.