TTD: మార్చి 3న శ్రీ‌వారి ఆల‌యం మూసివేత‌

తిరుమ‌ల (CLiC2NEWS): వ‌చ్చేనెల మూడ‌వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం మూసివేయ‌నున్న‌ట్లు టిటిడి వెల్ల‌డించింది. మార్చి 3న చంద్ర‌గ్ర‌హ‌ణం మ‌ధ్యాహ్నం 3.20 గంట‌ల నుండి సాయంత్రం 6.47 వ‌ర‌కు ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ఆల‌యం మూసివేయ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఇఒ వెంక‌య్య చౌద‌రి తెలిపారు. అదే రోజు కుమార‌ధార తీర్థ ముక్కోటి ఉత్స‌వాలు జ‌రుగుతాయ‌ని, వాటికి తగిన ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Tirumala News: ఎల్లుండి మే నెల‌ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల టికెట్ల విడుద‌ల‌

Leave A Reply

Your email address will not be published.