అన్నదాత ఆత్మగానం

 

కష్టాల కడలిలో కరిగే రైతన్న..!

కన్నీటి కాలువలో కలిసే రైతన్న..!

కొనుగోలు కేంద్రాల్లో కాచే నిరీక్షణ..!

కడగండ్ల వానలకు చెదిరే ఆకాంక్షణ..!

రైతే రాజు అన్నారు రైతన్నా..!

గిట్టుబాటు ధరను నిర్ణయించలేని స్థితిలో నీవెన్నన్నా..!

పచ్చని పొలాల వెనుక నీ త్యాగ గాథను ఎవరు గమనించారు..?

ప్రతి గింజలో దాగిన నీ జీవన వ్యథను ఎవరు విన్నారు..?

 

దేశానికి వెన్నెముకవైన రైతన్నా..!

నీ చిరునవ్వు పూసే ఆ రోజుకై

ఎదురుచూస్తున్న కాలమన్నా ..!

– మంజుల పత్తిపాటి
9347042218

1 Comment
  1. […] Also Read: అన్నదాత ఆత్మగానం […]

Leave A Reply

Your email address will not be published.