Bhadrachalam: రేప‌టి నుంచి `జై శ్రీ‌రామ్` ఇటుక‌ల విక్ర‌యం

భ‌ద్రాచ‌లం (CLiC2NEWS): భద్రాచ‌లం రామాల‌యంలో త‌యార‌వుతున్న జై శ్రీ‌రామ్ పేరుతో గ‌ల ఇటుక‌ల‌ను రేప‌టి (ఆదివారం) నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఈ ఇటుక ఒక్కోటి రూ. 60 ఉంటుంద‌ని అంచ‌నా.

కొత్త ఇంటి నిర్మాణంలో తొలి ఇటుక‌గా వీటిని వాడితే శుభం క‌లుగుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ ఇటుక‌ల త‌యారీకి ఆల‌యం ప్రాంగ‌ణంలోని గోశాల వ‌ద్ద సిద్ధం చేశారు. ఈ మేర‌కు కాంట్రాక్ట‌రు ఆల‌యానికి సంవ‌త్స‌రానికి రూ. 1.60 ల‌క్ష‌లు చెల్లించనున్నారు. కాగా ఈ ఇటుక‌లు చిత్ర‌కూట మండ‌పం స‌మీపంలో భ‌క్తుల విక్ర‌యించ‌డానికి ఉంచ‌నున్నారు. మొద‌టిసారి భ‌ద్రాచ‌లంలో ఈ ఇటుక‌ల‌ను త‌యారు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Also Read: TTD: మార్చి 3న శ్రీ‌వారి ఆల‌యం మూసివేత‌

Leave A Reply

Your email address will not be published.