తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా రాఘవులు దేవళ్ల
హైదరాబాద్(CLiC2NEWS) : తెలంగాణ బార్‌కౌన్సిల్ ఎన్నికల్లో రాఘవులు దేవళ్ల విజయం సాధించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల ఫలితాలను తాజాగా ప్రకటించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తంగా 55 మంది మహిళలతోపాటు 203 మంది పోటీచేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభంకాగా.. 23 మంది బార్‌కౌన్సిల్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ నేటి (మంగళవారం) తో పూర్తయ్యింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో రాఘవులు దేవళ్ల విజయం సాధించారు. ఈ సందర్భంగా హైకోర్టులో సహచర న్యాయవాదులు ఆయనకు శుభాకాంలక్షలు తెలిపారు. ఆయన ఇంతకుముందు డిఆర్‌టి (డెబిట్ రికవరి ట్రిబ్యూనల్) జనరల్ సెక్రటరీగా సేవలందించారు.

విజయానంతరం డిఆర్‌టి లో న్యాయవాదులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనకు సీనియర్ న్యాయవాదులు, జికె దేశ్‌పాండే, విజయ్ కుమార్, శ్రీధర్‌రెడ్డి తదితర న్యాయవాదులు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాఘవులు దేవళ్ల మాట్లాడుతూ.. అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని అన్నారు. అడ్వకేట్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.