హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో లారీ హల్చల్
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్‌లో శుక్రవారం ఓ లారీ హల్చల్ చేసింది. వేగంగా వచ్చి డీసీఎం వ్యాన్‌ను వెనుక నుండి ఢ కొట్టింది. దీంతో డీసీఎం వ్యాన్ అదుపుతప్పి ఓ ద్విచక్రవాహనాన్ని ఢ కొట్టింది. అంతటితో ఆగకుండా హనుమాన్ ఆలయం ప్రహరీగోడను ఢకొీట్టి అప్పుడు ఆగింది. ఇంతలో ఈ లారీని వెనుక నుండి మరో మినీ లారీ ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మినీ లారీలో ప్రయాణిస్తున్న నలుగురూ గాయపడ్డారు. ఈ ఘటనతో ఉప్పల్-సికింద్రాబాద్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుడు బంజారాహిల్స్‌కు చెందిన రాంచందర్(42)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.