29కి చేరిన స్ట్రెయిన్ కేసులు
న్యూఢిల్లీ: ఒక వైపు కరోనా మహమ్మారి కలవరపెడుతున్న సమయంలోనే.. కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది. మన దేశంలో కూడా క్రమంగా ఈ కేసులు పెరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో యూకే నుంచి, యూకే మీదుగా భారత్కు వచ్చినవారిపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. అన్ని రాష్ట్రాలు ఆ ప్రయాణికులను గుర్తించి టెస్ట్లు చేస్తున్నారు. తాజా భారత్లో మరో నలుగురికి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర సర్కర్ ప్రకటించింది. దీంతో, ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 29కి పెరిగింది. గత 3 రోజుల్లో 25 మంది ఈ కొత్త స్ట్రెయిన్ బారిన పడగా.. మరో నాలుగు కేసులు తాజాగా నమోదు కావడంతో ఆ కేసుల సంఖ్య 29కి చేరింది. ఇక, ఇందులో 10 కేసులు ఢిల్లీలోనే నమోదు అయ్యాయి.. బెంగళూరులో 10, హైదరాబాద్లో 3, పుణెలో 5, బెంగాల్లోని కళ్యాణిలో 1 కేసు నమోదైంది.. హైదరాబాద్ కింద చూపిస్తున్న 3 కేసులు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవి. తెలంగాణలో రెండు కేసులు, ఏపీలో ఒక కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త స్ట్రెయిన్ బారినపడ్డవారినంతా ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.