ప్రముఖ నగల వ్యాపారి కాల్చివేత

శ్రీనగర్‌: నూతన సంవత్సరం తొలి రోజే శ్రీనగర్‌లోని బిజీ మార్కెట్లో వ్యాపారి సత్పాల్ సింగ్ (62) పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. సారాయ్ బాలా వద్ద గురువారం ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు. ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టతలేదు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.