ఏపీలో కొత్తగా 326 మందికి కరోనా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 350 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,82,612 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,72,266 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,238 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,108 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 58,519 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,18,84,085 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
