పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Ramagundam Police Commissionerate: మద్యం మత్తులో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ మేరకు మంచిర్యాల జోన్ పరిధిలోని భీమారం ఎస్ ఐ రాజేందర్ తెలిపారు. మంచిర్యాల జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు చొప్పరి పవన్ డయల్ 100కు ఫోన్ చేశాడు. తాను ఇంట్లో లేని సమయంలో తన అన్న చొప్పరి శేఖర్ మద్యం సేవించి ఇంటికి వచ్చి తన భార్యతో గొడవపడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన బ్లూకోల్ట్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు సిబ్బందితో చొప్పరి శేఖర్ దుర్భాషలాడటమే కాకుండా, వారిపై దాడికి యత్నించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని చెన్నూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Also Read: Ramagundam: భయం వీడండి… ఫిర్యాదు చేయండి…