SBI: 49 స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులు

Job News: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ (Specialist Cadre Officer) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఎంపిక జ‌రుగుతుంది.

మొత్తం పోస్టులు 49..

అసిస్టెంట్ మేనేజ‌ర్ (లా) పోస్టులు- 20
డిప్యూటి మేనేజ‌ర్ (లా) పోస్టులు -29

లా డిగ్రీ పూర్తి చేసి, బార్ కౌన్సిల్లో న్యాయ‌వాదులుగా న‌మోదు చేసుకున్నవారు అర్హులు. రెండు నుండి నాలుగేళ్ల ప్రాక్టీసింగ్ అనుభవం ఉన్న‌వారికి ప్రాధాన్యం ఉంటుంది. 25 నుండి 35 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌ను జులై 14వ తేదీ లోపు పంపించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.750 గా నిర్ణ‌యించారు. ఎస్‌సి, ఎస్‌టి , దివ్యాంగుల‌కు ఫీజు మిన‌హాయింపు ఉంది.

ఆన్‌లైన్ ఎగ్జామ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ పోస్టుల‌కు ఎంపిక జ‌రుగుతుంది.

Job News:  SSC: 12 వేల‌ పోస్టుల‌తో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ 2026 నోటిఫికేష‌న్

Leave A Reply

Your email address will not be published.