AP: పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు అధికారి ఇంట్లో ఎసిబి సోదాలు

తిరుప‌తి (CLiC2NEWS) : తిరుప‌తిలోని పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు (PCB)  కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న జోన‌ల్ అధికారి యుగంధ‌ర్ ముని ప్ర‌సాద్‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌తో ఎసిబి సోదాలు చేప‌ట్టింది.  క‌ర్నూలు న‌గ‌రంలోని చాణ‌క్య‌పురి కాలనీలో ఉన్న  యుగంధ‌ర్ ఇంటితో పాటు తిరుప‌తి,  హైద‌రాబాద్ లో ఏక‌కాలంలో సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.5 ల‌క్ష‌ల‌కు పైగా న‌గ‌దును స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న భార్య పేరున 4 ఓపెన్ ప్లాట్లు, 17 తులాల బంగారం, 3 కిలోల వెండి, ఎస్‌బిఐ లాక‌ర్‌, రెండు ఇళ్లు  ఉన్న‌ట్లు సోదాల‌లో గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.4 కోట్లు ఉండ‌వ‌చ్చ‌ని ఎసిబి డిఎస్‌పి వెల్ల‌డించారు.

Also Read : Nizamabad: ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ నివాసంలో ఎసిబి సోదాలు

Leave A Reply

Your email address will not be published.