Nizamabad: ఎక్సైజ్ సూపరింటెండెంట్ నివాసంలో ఎసిబి సోదాలు
నిజామాబాద్ (CLiC2NEWS): ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఎసిబి మంగళవారం సోదాలు నిర్వహిస్తోంది. ఆరేళ్లుగా మల్లారెడ్డి నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంఓ నిజామాబాద్ లోని ఆయన నివాసంలోనూ, హైదరాబాద్ మచ్చబొల్లారంలో తనకు సంబంధించిన ఇంటితో పాటు సూనరింటెండెంట్ కార్యాలయం, ఆయన బంధువుల ఇళ్లల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ ప్రగతినగర్‌లో ఉన్న ఆయన నివాసంలో కీలక పత్రాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డిన అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించినట్లు సమాచారం.