రేపటి నుంచి అక్క‌డ బ‌డులు ప్రారంభం..

భువనేశ్వర్: దేశ‌మంతా కరోనా లాక్‌డౌన్‌ నుంచి తొమ్మిది నెలలుగా పాఠశాలలు మూతపడిన విష‌యం తెలిసిందే. నిబంధ‌న‌ల మ‌ధ్య ఒడిశాలో శుక్రవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. పలు పాఠశాలల్లో సామాజిక దూరం, ఇతర కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్క్‌లు ధరించేలా చూడడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచామని, విద్యార్థుల మధ్య కనీస దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, విద్యార్థులు ఇండ్ల నుంచే ఆహారం, నీరు తీసుకువచ్చుకోవాలని, విద్యార్థులు గుమిగూడకుండా ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఒడిశా ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మోహపాత్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను కోరారు.

Leave A Reply

Your email address will not be published.